పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ అత్యంత పక్బందీగా తరలించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పొలింగ్ కేంద్రాలకు పొలింగ్ మెటీరియల్ అత్యంత పక్బందీగా తరలించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. స్ధానిక అర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సహయ రిటర్నింగ్ అధికారి టి సీతారామ మూర్తి , ఆర్డీఓ కృష్ణ నాయక్, తహసిల్దార్ పాపా రావు తో కలిసి పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీ. ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్టాట్యూటరీ , నాన్ స్టాట్యూటరీ ఫారాలను ఆయా పొలింగ్ కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 92. పొలింగ్ కేంద్రాలకు 15 రూట్ ల ద్వారా పొలింగ్ కేంద్రాలకు సిబ్బందికి, మెటీరియల్ తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పొలింగ్ నిర్వహించే సిబ్బంది , భద్రతా సిబ్బంది ముందుగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకునేలా చర్యలూ తీసుకోవాలని పేర్కొన్నారు. సాయింత్రం లోగా ఆయా పొలింగ్ కేంద్రాలకు చేరుకునేలా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సజావుగా ఎన్నికలు నిర్వహణ కోసం 400 మంది పోలీసులు నియ4మించడం జరిగిందన్నారు. మొత్తం 62970 ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు. రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగానే చర్యలూ తీసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *