Breaking News

ఈ నెల 27,28 తేదీల్లో బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలోని త్రాగునీటి సరఫరా జరిగే పాత 600ఎంఎం డయా ఔట్లెట్ ఆర్సీసి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ మరమత్తు పనులను ఈ నెల 27(గురువారం) ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన 27 (గురువారం) సాయంత్రం నుండి 28 (శుక్రవారం) వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని, మెరుగైన త్రాగునీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల మరమత్తులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. అందులో భాగంగా బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలోని పైప్ లైన్ మరమత్తు పనులను చేపట్టడం జరుగుతుందని, పనుల వలన పాత గుంటూరు, ముగ్దూం నగర్, విజయశాంతి నగర్, భగత్ సింగ్ నగర్, నాగాలక్ష్మీ నగర్, యానాది కాలనీ, దుర్గా నగర్, ప్రియాంక గార్డెన్స్, ఆనందపేట జీరో లైన్, జానీ మృత్యుంజయ నగర్, జానీ స్వరాజ్య నగర్, గౌడ కాలనీ, జికె నగర్, ఎల్బీ నగర్, అలీ నగర్, అంకమ్మతల్లి గుడి రోడ్, రాములు వారి వీధి, సత్యనారాయణ స్వామి గుడి వీధి, యాదవుల బజార్, డబ్బాల సందు, పొన్నూరు రోడ్ ఎడమ ప్రాంతం, ఇసుక వాగు వీధి, ముఫ్తీ వారి వీధి, పాల హాస్పిటల్, మేకల వారి వీధి, సేవ సంగంవారి వీధి, లాల్ జాన్ బాష షాదీ ఖానా ప్రాంతం, మంత్రివారి వీధి, సంగడిగుంట, బాబుజి రోడ్, వడ్డే గూడెం, కబాడీ గూడెం, లాంచేస్టర్ మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని, తిరిగి మార్చి 1వ తేదీ ఉదయం నుండి యధావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. కావున నగర ప్రజలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకొని, నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *