Breaking News

27న కెనాల్ రోడ్ లో రథోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 27వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు కెనాల్ రోడ్ లో రథోత్సవం జరగనుందని శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రం కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బయన శ్రీ రాజేష్ చెప్పారు. మంగళవారం అన్న సత్రం హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 27వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు రథోత్సవాన్ని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. రథోత్సవంలో శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్లు, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్లు, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లు, శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవ మూర్తులు పాల్గొని భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. రథోత్సవంలో విశిష్ట అతిధులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, శాసనసభ్యులు వై. సుజనా చౌదరి, బొండా ఉమామహేశ్వరరావు ,గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి కార్యనిర్వహణాధికారి కే. రామచంద్ర మోహన్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్న సత్రం కమిటీ ఆధ్వర్యంలో 155 సంవత్సరాలుగా రథోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కమిటీ సభ్యులు డోగిపర్తి శంకర రావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *