Breaking News

మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలలో మహాశివరాత్రి పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ మరియు అధికారులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కృష్ణా`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగెల శివరామ ప్రసాద్‌ (రాజా) మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనలో ఆయన మాట్లాడుతూ కైలాస వాసుడు బోలా శంకరుడు పార్వతి సమేత పరమేశ్వరుడు దేవతాగణాలకు అధిపతి ప్రజలందరికీ అమ్మ పార్వతి తండ్రి పరమేశ్వరుడి ఆశీస్సులు ఆయన చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనసారా శివపార్వతులను వేడుకుంటున్నానని తెలిపారు. మంగళవారం రేపల్లే, బాపట్ల, నరసరావుపేట తదితర పరిసర ప్రాంతాలలో పర్యటనలో భాగంగా కృష్ణా`గుంటూరు జిల్లాల ఇండిపెండెంట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించినట్లు తెలిపారు. విద్యార్థి నాయకుడిగా ఎంతో అనుభవం ఉన్న తనను గెలిపించడం ద్వారా పట్టభద్రుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. సీరియల్‌ నెంబర్‌ 5కి మీ మొదటి ప్రాధాన్యత ఓటును 1 అంకె వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై ఆంధ్ర యూనివర్సిటీలో పలు పోరాటాలు చేసి విజయం సాధించానన్నారు. లా పూర్తి చేసి బెజవాడ బార్‌ అసోసియేషన్లో ప్రాక్టీస్‌ చేస్తున్నానని, హనుమాన్‌ జంక్షన్‌లో ఉచిత న్యాయ సలహా కేంద్రం పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. విద్యార్థి దశ నుండి విద్యార్థుల యొక్క సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని వారి సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తుల కృషి చేస్తానన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టబద్రుల సమస్యలను శాసనసభలో చర్చించి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *