విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ NDA కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ సంఘం ఆధ్వర్యంలో పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో ఓ హోటల్ పత్రిక సమావేశం నిర్వహించడం జరుగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీసీ సంఘ నాయకులు కేశన శంకర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులు కేశన శంకర్ రావు మీడియాతో మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 3 సార్లు ఎమ్మేల్యే గా గెలుపొందారని ఒకసారి మంత్రి గాను పనిచేసిన అనుభవం ఉందని గవర్నర్ ప్రసంగంలో బీసీ చట్టం గురించి ప్రసంగించడం జరిగింది, దానికి మేము చాలా సంతోషిస్తున్నామని రాష్ట్రం విడిపోయిన తరువాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చెయ్యడం అభినందనీయమన్నారు.
పవన్ కళ్యాణ్,పురంధేశ్వరి రాష్టంలో 55 శాతం బీసీ లు ఉన్నారని కేంద్రం తో చెప్పటం జరిగిందని ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థని గెలిపించాలని కోరుచున్నామన్నారు.
ఎన్డీఏ కూటమిఎమ్మెల్సీ అభ్యర్ధి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ… సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారన్నారు. నన్ను గెలిపించే ప్రయత్నంలో వారు భాధ్యత తీసుకోవడం చాలా అనందంగా ఉందన్నారు. బీసీలు అన్ని రంగంలో ముందుండాలి సార్వత్రిక ఎన్నికల్లో బీసీ లు చూపిన చొరవ మర్చిపోమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్నూ గెలిపించవలసినదిగా ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News