Breaking News

శివుని అనుగ్రహంతోనే రాష్ట్రాభివృద్ధి సాకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో మహాశివరాత్రి పుణ్యస్నానం చేసి, పితృదేవతలకు తర్పణాలు పిండప్రదానం గావించారు. అనంతరం ముత్యాలంపాడులోని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మహాశివుని ఆశీస్సులు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ పర్వదినాన ఉదయాన్నే లేచి నదీ తీరప్రాంతాలలో స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణ పిండ ప్రదానాలు చేస్తారని, లింగోద్భవ కాలం వరకు ఉపవాస దీక్ష చేసి పరమశివుని భక్తితో కొలుస్తారని తెలిపారు. ఆ యొక్క పరమశివుని అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి కొత్త నాగేంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు వాటపల్లి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *