Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భక్తులకు డ్రింక్స్, మంచినీటి సరఫరా, అల్పాహార వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ నందు వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్  వైసీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వైయస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని ప్రార్దించారు. దేవస్థానం వద్ద గల కృష్ణవేణి ఘాట్ నందు కృష్ణానదిలో పుణ్య స్థానాలు ఆచరించడనికి విచ్చేసిన భక్తులకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5 వేల మందికి డ్రింక్స్, మంచినీటి సరఫరా, అల్పాహార ఏర్పాట్లు చేసి భక్తులకు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుప్పాల కుమారి వైసీపీ నాయకులు టిపి రెడ్డి, పులిపాటి దుర్గారెడ్డి, సుబ్బారెడ్డి,మద్దెల పవన్, ములక శ్రీనివాస్ రెడ్డి, గొర్ల గోవిందు , మేడా రమేష్, తిరుపతి రెడ్డి, జోగారాజు, శివారెడ్డి, శ్రీరాజ్, జోగా రమణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *