Breaking News

మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివరాత్రిని పురస్కరించుకొని 26.02.2025 బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో రాత్రి 9 గంటల నుండి మహన్యాసం నిర్వహించగా, తదుపరి లింగోద్భవ అభిషేకం, మహా నివేదన, హారతి మంత్రపుష్పం కార్యక్రమములు భక్తి శ్రద్దలతో జరిగాయి. అనంతరం శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవ క్రతువు వైభవంగా ప్రారంభమై, పండితుల మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ కన్నుల పండువుగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమం లో స్థానాచార్య శివ ప్రసాదశర్మ, ప్రధాన అర్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *