విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎన్నికల అధికారి, గౌరవ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీ గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు స్థానిక సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు.. ఆదేశాల అమలుపై పూర్తి పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News