Breaking News

సీఎం చంద్రబాబును కలిసిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌ అంబుల వైష్ణవి

-అభినందించిన సీఎం….రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు. అతిచిన్న వయసులోనే అంబాసిడర్‌గా నియమితులైన వైష్ణవిని సీఎం అభినందించారు. రాష్ట్రాభివృద్ధిలో యువత పాలుపంచుకోవాలని, అలాంటి వారికి వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతి కోసం విరాళాలు సేకరించాలన్నది తన లక్ష్యమని వైష్ణవి సీఎంకు వివరించగా…యువతకు వైష్ణవి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అన్నారు. రాజధానిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను, సంబంధిత అంశాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం సూచించారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *