Breaking News

వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నాం.

-తొలి అడుగు లోనే విజయం సాధించాం.
-త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్లు పిలుస్తాం.
-షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచే విధంగా అడుగులు వేస్తున్నామని ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వేసిన తొలి అడుగులోనే విజయం సాధించామని ఆయన తెలిపారు. కర్నూల్ జిల్లా ఎల్లార్తి గ్రామం షేక్ షావలి షాషావలి దర్గా టెండర్ల ద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెంచామని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలో డైరెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్న దర్గాలకు టెండర్ల పిలుస్తామని తద్వారా వక్ఫ్ బోర్డ్ కు ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. వక్ఫ్ బోర్డ్ ను పారదర్శకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డ్ కు ఆదాయాన్ని పెంచడంతో పాటు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న రోజుల్లో వక్ఫ్ బోర్డ్ అభివృద్ధి, ముస్లిం సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *