Breaking News

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిందని, ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏదైనా సమస్య కోసం రోజుల తరబడి తిరగకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, ప్రజలు ఇబ్బంది పడకుండా వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం పరిష్కరించనుందని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆస్థి, ఖాలీ స్థల, నీటి మీటర్ల పన్ను విధింపు, చెల్లింపు, వివాహ నమోదు, డ్రైనెజ్ కనెక్షన్, నూతన ట్రేడ్ లైసెన్స్ ధరఖాస్తు, ఫీజుల చెల్లింపు వడ్డీ 32 మున్సిపల్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్‌ నుంచే అధికారిక సమాచార మెసేజ్‌లు పంపిస్తుందని, ఉదాహరణకు వర్షాలు, వరదలు, విద్యుత్ మరమ్మతులు, ఎమర్జెన్సీ, హెల్త్, పర్యాటకం, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారన్నారు. ప్రజలు తమ వినతుల్ని, ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుందని, అందులో పేరు, మొబైల్‌ నంబర్, అడ్రస్ నమోదు చేసి, వినతి, సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్‌ నంబరు పంపిస్తారని, దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కనుక నగర ప్రజలు ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వాట్స్ అప్ గవర్నెన్స్ ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *