రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషి జీవనానికి అత్యవసరమైన నీటిని వృధా కానివ్వకుండా పరిరక్షించుకోవాలని భవిష్యత్తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి జరిగే కృషిలో ప్రజలందరు భాగస్వామ్యులు కావాలని కమిషనరు కేతన్ గార్గ్ పిలుపునిచ్చారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగము మరియు నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనల మేరకు శుక్రవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టుట జరిగినది. ది.25-02-2025 వ తేది హై స్కూలు స్థాయిలో జలసంరక్షణపై అవగాహన కల్పించు నిమిత్తం నగరపాలక సంస్థకు చెందిన పదమూడు (13) ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు జరిగాయి. అందులో విజేతలైన ముగ్గురు విద్యార్ధులలో మొదటి బహుమతి విజేతగా యు.ప్రశాంత్, 10వ తరగతి, గాంధీపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, రెండవ బహుమతి విజేతగా ఎ.ప్రియదర్శిణి, 9వ తరగతి, నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల, మూడవ బహుమతి విజేతగా ఎ.సంధ్య వినయణి, 9వ తరగతి, ఎస్.కె.ఆర్.ఆర్. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల బహుమతి ప్రధానంతో పాటు, పాల్గొన్న విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందచేసి , సత్కరించారు. తొలుత ఉదయము గం.6:00 నుండి 8:00 వరకు యోగా కార్యక్రమం చేపట్టారు. పలు యోగా సంస్థల సభ్యులు, నగరపాలక సంస్థ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ నదీజలాలను కలుషితం కాకుండా ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం నీటిశుద్ధి కొరకు మురుగునీటి శుద్ది కేంద్రాన్ని గతంలో 30 ఎం.ఎల్.డి. సామర్ద్యంతో నిర్మించడం జరిగిందని, పెరుగుతున్న జనాభా దృష్ట్యా అదనంగా రూ.95.00 కోట్లతో 50.60 ఎం.ఎల్.డి. సామర్ద్యంతో జాతీయ నదీ సంరక్షణ సంస్థ నిధులతో చేపట్టామని, ఈ సంవత్సరములో సదరు కేంద్రం పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే యోగా శరీర శుద్దికి చాలా ఉపయోగ పడుతుందని, అందరూ యోగా చేయాలని తద్వారా మానసిక వత్తిడి శరీర ఆరోగ్యం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి పుష్కర్ ఘాట్ నందు బోట్ రేస్ ఏర్పాటు చేసిన బోట్ రేసును జండా ఊపి ప్రారంభించారు. నగరంలో మత్స్యకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ పోటీలో విజేతలుగా నిలిచినటువంటి శ్రీ నాతి పోసయ్య రూ.25000/-లు, మల్లాడి సుబ్బన్న రూ.15000/-లు మరియు పోతాబత్తుల నాగరాజు రూ.10000/-లు బహుమతులు అందచేసారు. ఉదయం గం.8:00 నుండి 10:00 వరకు కాస్మొపాలిటన్ క్లబ్ పై మ్యూరల్ పెయింట్ వేయడం జరిగింది. నదీ జలాలు మరియు జలచరాల పరిరక్షణ అంశముపై పెయింటింగు కార్యక్రమము నిర్వహించడమైనదని పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అలాగే సాయంత్రం గం.5:00 లకు వివిధ వర్గాల విద్యార్ధులు, ప్రజలు, కార్యదర్శులు నీటి సంరక్షణ ఆవశ్యకత తెలియచేస్తూ ప్లకార్డు, నినాదాలతో ఊరేగింపు జరిగింది. అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు విజేతలకు బహుమతి ప్రధానం కార్యక్రమాలు నిర్వహించడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు పి వి రామలింగేశ్వర్, డిప్యూటి కమిషనరు ఎస్ వెంకటరమణ, మున్సిపల్ ఆరోగ్య అధికారిణి డా.ఎ.వినూత్న, ఎగ్జిక్యూటివ్ యింజనీర్ మదర్షా ఆలీ, మేనేజరు ఎండి అబ్దుల్ మాలిక్ అస్ఫర్, కమాండ్ కంట్రోల్ రూం హెడ్ రవితేజ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News