రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాష్ట్ర ప్రథాన కార్యదర్శి ఎమ్. విజయానంద్ అమరావతి నుంచీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కి స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జెసి ఎస్ చిన్న రాముడు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా ఎజెండా అంశాలుగా పింఛన్ల పంపిణి , తాగునీటి సరఫరా వేసవి కార్యాచరణ ప్రణాళిక , ప్రజా రవాణా ,నిత్యావసర సరుకుల పంపిణీ, రియల్ టైమ్ గవర్నెన్స్ , ప్రజా సమస్యల పరిష్కార చర్యలు తదితర అంశాల ఆధారంగా సానుకూల ప్రజా అవగాహన , ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 MSME పార్కులు, ప్రభుత్వ కేటాయింపు భూమి నుండి ఫీడర్ స్థాయి సోలారైజేషన్ పథకం , MSME సర్వేలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి ఆర్ డబ్ల్యు ఎస్, మునిసిపల్ శాఖలు కార్యాచరణ ప్రణాళిక అమలు చెయ్యాలని ఆదేశించారు. రానున్న 4 నెలలు ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీరు సరఫరా విధానం పై ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకి అందచేస్తున్న సేవలు పై ప్రతి డిపో పరిథిలో ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదుల నేపధ్యంలో రానున్న రోజుల్లో వాటిని అధిగమించేలా చొరవ చూపాలని సూచించారు. పౌర సరఫరాల ద్వారా దీపం గ్యాస్ సిలిండర్ డెలివరి కొరకు నగదు డిమాండ్ పై గ్యాస్ ఏజెన్సీస్ లతో , నిత్యావసర సరుకుల సరఫరా ఎమ్ డి యూ పంపిణి చేసే క్రమంలో ఫిర్యాదుల నేపధ్యంలో ఆయా ఏజెన్సీస్ , అసోసియేషన్ లతో సమావేశం నిర్వహించినట్లు తెలియ చేశారు. ఎమ్మెస్ఎమ్ఈ సర్వే పై దృష్టి పెట్టాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి ఆర్ డబ్ల్యు ఎస్, మునిసిపల్ శాఖలు కార్యాచరణ ప్రణాళిక అమలు చెయ్యాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ త్రాగునీరు సరఫరా విధానం పై నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకి అందచేస్తున్న సేవలు పై ప్రతి డిపో పరిథిలో ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఐ వి ఆర్ ఎస్ ద్వారా ఫిర్యాదుల నేపధ్యంలో రానున్న రోజుల్లో వాటిని అధిగమించేలా చొరవ చూపాలని సూచించారు. పౌర సరఫరాల ద్వారా దీపం గ్యాస్ సిలిండర్ డెలివరి కొరకు నగదు డిమాండ్ పై గ్యాస్ ఏజెన్సీస్ లతో , నిత్యావసర సరుకుల సరఫరా ఎమ్ డి యూ పంపిణి చేసే క్రమంలో ఫిర్యాదుల నేపధ్యంలో ఆయా ఏజెన్సీస్ , అసోసియేషన్ లతో సమావేశం నిర్వహించినట్లు తెలియ చేశారు. ఎమ్మెస్ఎమ్ఈ సర్వే పై దృష్టి పెట్టాల్సి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News