Breaking News

వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుపై వర్చువల్ సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యవసాయం మరియు గ్రామీణ శ్రేయస్సుపై బడ్జెట్ అనంతర విషయాల గురించి భారత ప్రధానమంత్రి వర్చువల్ గా పాల్గొనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో డిఆర్డిఏ సమావేశ మందిరం నందు బ్యాంకర్లు అందరూ వారి యొక్క కస్టమర్లు అయినటువంటి రైతులతో కలిసి మరియు అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు పాల్గొనడం వీక్షన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వర్చువల్ గా పాల్గొన్నారు. మన తిరుపతి జిల్లా నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్.ఎం రాంప్రసాద్ మరియు ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి  వర్చువల్ గా మాట్లాడుతూ వ్యవసాయ రుణాలకు ఇచ్చే సబ్సిడీని 3 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. పంట రుణాల పరిమితి కొల్లేటరల్ సెక్యూరిటీ లేకుండా మొట్టమొదటిసారి రూ. 1.60 లక్షల నుండి 2 లక్షల వరకు పెంచడం జరిగిందని తెలిపారు. పీఎం కిసాన్ ద్వారా అందరికీ చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఇచ్చే రుణాలు 2014 -2024 మధ్యకాలంలో 347% పెరగడం గర్వించదగ్గ విషయమని తెలపడం జరిగింది. పై విషయాన్ని ఎల్డిఎం విశదీకరిస్తూ బ్యాంకర్లు రైతులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామసభలు, మండల స్థాయిలో రైతుల సమావేశాలలో పాల్గొని వివరించాలని కోరడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *