Breaking News

ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన

-ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తపేట లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దేవస్థానంలో నూతన ధ్వజ స్థంభం ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఎమ్మెల్యే సుజనాకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టింపచేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో అభివృద్ధి చెందాలని సుజనా ఆకాంక్షించారు. ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయాన్ని నిర్మించి 104 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజగోపురం, ఆంజనేయస్వామి, గరుత్మంతుని విగ్రహాలను మరియు ధ్వజస్తంభం పునం ప్రతిష్ట చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు సారిపల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు మురపాల దుర్గారావు, బోరా కనకారావు, నమ్మి భాను ప్రకాష్, ఐతా కిషోర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, అవ్వారు బుల్లబ్బాయి, పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *