విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్ (వన్ టౌన్, విజయవాడ)లో సోమవారం MSME ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించి, బ్యాంక్ యొక్క పాత్ర మరియు క్రొత్త MSME కస్టమర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మువ్వల శ్రీధర్, రీజనల్ హెడ్,విజయవాడ స్వాగత ప్రసంగంతో ఈ కార్యక్రమం మొదలవగా, ఎం.ఎస్. రామారావు, డిప్యూటీ జోనల్ హెడ్ ఈ ఔట్ రీచ్ క్యాంపును నిర్వహించడంలోని హేతుబద్ధతపై మరింత అవగాహన కల్పించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఆఫీస్, ముంబై నుంచి విచ్చేసిన బిజు వాసుదేవన్, చీఫ్ జనరల్ మేనేజర్ తన ముఖ్య ప్రసంగంలో, MSMEల సమర్థత మరియు సామర్థ్యం గురించి మరియు భారత ఆర్థిక వ్యవస్థలో అవి పోషిస్తున్న పాత్ర గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హరీష్ బేతా, డిప్యూటీ రీజినల్ హెడ్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది MSME రుణగ్రస్తులకు మంజూరు పత్రాలు అందచేయటం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ నలుమూలల నుండి 150 మందికి పైగా MSME వ్యవస్థాపకులు మరియు యూనియన్ బ్యాంక్ యొక్క వివిధ శాఖల మేనేజర్లు మరియు ఇతర అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News