రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు పనిచేసే ఆఫిసుల్లో, ప్రాంతాలలో, మహిళలపై లైంగిక వేధింపు చట్టాలు (sexual harassment act ) గురించిన పూర్తి అవగాహనను, మహిళలకు కల్పించాల్సిన అవసరం ఎంతో ఉందని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి
ఎస్. శ్రీలక్ష్మి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు పేర్కొన్నారు. స్ధానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మహిళ దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా మహిళ స్ర్తీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన, జిల్లా న్యాయ సేవధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, 1987లో సుప్రీం కోర్టు లో, పేద బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్దుల కు ఉచిత న్యాయ సేవలనందించాలనే ఆశయంతో,రూపొందించ బడిన, న్యాయ సేవాధి కార సంస్థ సేవలగురించి, వారికి అవగాహన కల్పించి, వారికి న్యాయం చేకూరే విధంగా, అందరూ, సేవా దృక్పధంతో, సహాయ సహకారాలాన్నీ అందించాలని, మహిళా రక్షక కానిస్టేబుల్స్ కు సూచించారు.
ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ, అనుకోని సంఘటన జరగక ముందే, ముందు జాగ్రత్తగా, మహిళా రక్షక కానిస్టేబుల్స్, అనుమానితులకు హెచ్చరికలు చేయాలని అన్నారు. మహిళల రక్షణకై, రూపొందించిన గృహ హింస చట్టం 498ఏ లో ఉద్దేశింపబడిన విస్తృత న్యాయన్ని, బాధిత మహిళలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని అన్నారు.ఎన్ని చట్టాలు చేస్తున్నా, మహిళలకు ఆశించినంత స్థాయిలో అందించలేక పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో ప్రత్యెక మహిళ రక్షక దళం ఎర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.
జిల్లా శిశు మహిళా అధికారి కె.విజయ్ కుమారి మాట్లాడుతూ, అనాధ పిల్లల, మహిళల రక్షణకై,ప్రతీ మండలం లో మా కార్యాలయ సిబ్బంది, రక్షణ కల్పిస్తున్నదని, చట్ట రీత్యా, నిర్నీత నగదు అందించి, సహాయ సహకారాలాంది స్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ అధికారులు, మహిళా రక్షక కానిస్టేబుల్స్, లీగల్ వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News