Breaking News

గ్రామీణ మహిళల సుస్థిర భవిష్యత్తుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ కృషి

-కృష్ణారావు పాలెం గ్రామ ప్ర‌జ‌ల‌తో పంచాయతీ ఛాంపియ‌న్స్ స‌మావేశం

ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ జాతీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీ రాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్) లో స‌మగ్ర గ్రామీణాభివృద్ది కోసం శిక్ష‌ణ పొందిన పంచాయ‌తీ చాంపియ‌న్స్ మంగ‌ళ‌వారం ఎ.కొండూరు మండ‌లం కృష్ణారావుపాలెం గ్రామ ప్ర‌జ‌ల‌తో సమావేశం నిర్వ‌హించారు. గ్రామాల్లో తాగునీరు-సాగునీరు స‌మ‌స్య రాకుండా, వ్య‌వ‌సాయం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, వైద్యం, విద్య, ఉపాధి అవ‌కాశాలు ఎలా అభివృద్ది చేసుకోవచ్చు అనే అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించారు. గ్రామంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుని గ్రామాన్ని ఏ విదంగా అభివృద్ది చేసుకోవ‌చ్చు అనే అంశాన్ని పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ వివ‌రించారు

ఈ స‌మావేశంలో ఎ.కొండూరు మండ‌ల పార్టీ ప్రెసిడెంట్ గడ్డి కృష్ణారెడ్డి, మాజీ ఎ.ఎమ్.సి చైర్మ‌న్ అల‌వాల రమేష్ రెడ్డి , మండ‌ల స‌మైక్య అధ్య‌క్షురాలు చ‌ప్పిడి శ్రీల‌త , జిల్లా తెలుగు రైతు సంఘం కార్య‌ద‌ర్శి పిన్న‌మ‌నేని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువ‌త‌, మ‌హిళలు ఆర్థికంగా స్వ‌యం స‌మృద్ధి సాధిస్తేనే గ్రామాభివృద్ధి జ‌రుగుతుందన్నారు. అందుకోస‌మే ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) గ్రామీణ మహిళలతో పాటు యువ‌త‌కు స్వ‌యం ఉపాధి అవ‌కాశాల‌తో సుస్థిర భవిష్యత్తు ఏర్పాటు చేస్తున్న కృషి వివ‌రించారు.

పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ మ‌హిళ‌ల‌కు, నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌టం కోసం కేంద్ర ప్ర‌భుత్వం అందించే పి.ఎమ్.ఈ.జి.పి, ముద్ర లోన్, ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ ఫండ్స్ వినియోగం గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని చెప్పారు. అలాగే మ‌హిళల‌కు, నిరుద్యోగుల‌కు స్వ‌యం ఉపాధి రంగంలో వున్న కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించి ఆస‌క్తి వున్న వారితో కుటీర ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయించేందుకు పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ స‌హ‌కారం అందిస్తార‌ని చెప్పారు.

ఇక‌ కుటీర ప‌రిశ్ర‌మ‌ల్లో త‌యారు చేసే వ‌స్తువుల మార్కెటింగ్ విష‌యంలో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఏ విధంగా స‌హ‌కారం అందిస్తార‌నే విష‌యం వివ‌రించారు. గ్రామాల్లో ప్ర‌జ‌ల ఆర్థిక అభివృద్ది, కుటీర ప‌రిశ్ర‌మ స్థాప‌న‌, నిరుద్యోగ స‌మస్యకు ప‌రిష్కారం, ఉపాధి అవ‌కాశాల మెరుగుద‌ల కోసం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కృషి చేయ‌టంతో పాటు ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తార‌న్నారు. కుటీర‌ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు అవ‌స‌ర‌మైన‌ ఎమ్.ఎస్.ఎమ్.ఈ లోన్స్ ప్ర‌జ‌లు పొందెందుకు కావాల్సిన స‌హాయ స‌హ‌కారాలు అందించే ఏర్పాట్లు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చేసినట్లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ, , మాదిగ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ వాసం మునియ్య‌, టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు ప్ర‌సాద్, పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ షేక్ తాజుద్దీన్, పొద్దుటూరు గోపాల‌కృష్ణ‌,మేక‌ల రామారావు, సేకు ర‌మేష్, జువ్వా త‌రుణ్‌, వ‌సంత‌రావు, కొండ‌య్య‌, వెంక‌ట‌కృష్ణ‌,శ్రీరామ్ ల‌తోపాటు డ్వాక్రా సంఘం మ‌హిళ‌లు, గ్రామ ప్ర‌జ‌లు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *