Breaking News

ఫార్మర్ రిజిస్ట్రీ విశిష్ట సంఖ్య నమోదుకు త్వరలో మొబైల్ అప్లికేషన్

-డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు ఆంధ్రప్రదేశ్
-విశిష్ఠ సంఖ్య నమోదు లో వేగం పెంచి లక్ష్యంలో 75 శాతం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలి – తద్వారా రాష్ట్రానికి 3 వ విడత కేంద్ర ప్రత్యేక ఆర్థిక సహాయం కేటాయింపు .(SCA – Special central Assistance)
-త్వరలో ముగయనున్న వెబ్ లాగిన్ సేవలు – వాటి స్థానములో ప్రవేశ పెట్టనున్నమొబైల్ అప్లికేషన్ సేవలు
– రైతు విశిష్ఠ సంఖ్య నమోదులో ముందు వరసలో ఎన్టీఆర్ జిల్లా ,తరువాతి స్థానములలో శ్రీకాకుళం ,గుంటూరు & విజయనగరం జిల్లాలు.
-గిరిజన గ్రామాల్లో లోని గిరిజన రైతులకు అర్హత కలిగించి మేలు చేసేలా APFR ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్ లో ROFR అటవీ భూముల రికార్డుల వివరాలను బదిలీ చేయటం ,వాటిని అనుసంధానం చేయటం .

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది.05/03/2025 బుధ వారం రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు ఐఏఎస్ రాష్ట్రములోని అన్ని జిల్లా వ్యవసాయ అధికారు లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రీ రైతు విశిష్ఠ సంఖ్య నమోదు ను ఈ నెలాఖరు లోపు లక్ష్యంలో 75 శాతం పూర్తి చేసి 3 వ విడత కేంద్ర ప్రత్యేక సహాయం మన రాష్ట్ర ప్రభుత్వం నకు కేటాయింపు జరిగేలా రిజిస్ట్రీ నమోదు లో వేగం పెంచాలని కోరారు.ఇప్పటివరకు మొత్తం లక్ష్యం 60 లక్షల రైతుల నమోదు ప్రక్రియ గాను 35 లక్షల మంది రైతుల నమోదు ప్రక్రియ 60 % శాతం పూర్తిచేసుకున్నదని తెలిపారు .45 లక్షల రైతుల సంఖ్య నమోదు ద్వారా 75 % శాతం పూర్తి చేయాలని కోరారు .
రెవెన్యూ అధికారుల లాగిన్ లలో 12 లక్షల మంది రైతుల రికార్డు వివరాలు పెండింగ్ లో వున్నాయని ,వాటిని సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులులను ఆదేశించారు ,తద్వారా లక్ష్యం ను నిర్ణీత గడువు లోపు చేరుకోవటానికి అవకాశం ఉంటుంది అని తెలిపారు. మరో రెండు రోజులలో రైతుల రిజిస్ట్రీ నమోదుకు ప్రవేశ పెట్టనున్న మొబైల్ అప్లికేషన్ లో ముఖచిత్రం నమోదు అంశం వున్న దృష్ట్యా , కొత్త విదానములో నమోదు ప్రక్రియ పై అవగాహన పొందడంలో కొంత జాప్యం జరిగే అవకాశం వున్న కారణముగా ,ప్రస్తుతం అమలులో వున్న Weblogin వెబ్ లాగిన్ ప్రక్రియ ద్వారా రెవెన్యూ లాగిన్ లలో పెండింగ్ లో వున్న రికార్డులను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు .ఈ విషయమై కలెక్టర్ లతో మాట్లాడటం జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో అనంతపురం ,నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ భూముల , అసైన్డ్, ఇనాం భూముల రైతుల వివరాలు లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ,జాప్యం ఎక్కువుగా జరుగుతున్నదని ,వాటి పరిష్కారానికి రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు కేంద్ర పథక యాజమాన్యం తో( CPMU)పరిష్కరించాలని కోరారు.
తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని గ్రామములోని రైతుల వివరాలు ,వెబ్లాండ్ రికార్డు లలో కనబడుట లేదని ,రైతుకు సంబంధించిన వివిధ సర్వే నంబర్ లలోని భూమి వివరాలులను ఒకచోట కూర్చి కేంద్రీకరించడం జరగలేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *