Breaking News

శ్రీనివాస్‌ గోల్డ్‌ & డైమండ్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌ షోరూమ్‌ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో శ్రీనివాస గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ జువెలరీ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం ప్రోప్రైటర్స్‌ ఆత్మకూరు వెంకట జగన్‌మోహన్‌రావు (శ్రీనివాసరావు), ఆత్మకూరు సురేష్‌ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా డైమండ్‌ అండ్‌ జ్యువెలరీ అమ్మకాల్లో నరసరావుపేటలో శ్రీనివాస గోల్డెన్‌ డైమండ్స్‌ షోరూమ్‌ నడుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందామని తెలిపారు. అదేవిధంగా అనుభవంతో పాటు నాణ్యతమైన క్రొత్త డిజైన్‌ లతో బంగారు ఆభరణాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వినియోగదారుల అభివృద్ధికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆర్డర్‌ ప్రకారం అతి తక్కువ సమయంలో సరైన ధరకు ఆభరణాలు తయారు చేయించి అమ్మకాలు జరిపామని వారు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో నూతనంగా శ్రీనివాస గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్‌ ప్రారంభించామని తెలిపారు. వినియోగదారులు అభివృద్ధి తగ్గట్టుగా కొత్త డిజైన్లతో గోల్డ్‌ రిస్ట్‌ వాచీతో సహా డైమండ్‌ ఆభరణాలను అమ్మకాలకు సిద్ధంగా ఉంచామని తెలియజేశారు.
ప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 16వ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లు 100 గ్రా, 200, 300, 500, 1000, గ్రాముల బంగారు ఆభరణాలు కొనుగోలు పై టూ వీలర్స్‌, కారు, ఫారిన్‌ ట్రిప్పు, ఇంకా ఎన్నో ఆఫర్లు, 5 శ్రీవాణి టిక్కెట్లు తిరుమల (బ్రేక్‌ దర్శనం) చేయిస్తామని, లేదా 1/2 కేజీ ప్యూర్‌ వెండి ఇస్తామని, 1 కేజీ బంగారం ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి 5 లక్షల విలువచేసే కారు ఇవ్వబడునని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు బొమ్మసాని సుబ్బారావు పాల్గొన్నారు. తదనంతరం నరసరావుపేట బులియన్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గూడవర్తి చంద్రశేఖరరావు మాట్లాడుతూ నరసరావుపేటలో గత 25 సంవత్సరాలుగా గోల్డ్‌ & డైమండ్స్‌ వృత్తిలో చాలా నైపుణ్యత పొందారని, వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా కొత్త డిజైన్లతో అతి తక్కువ ధరలతో నాణ్యత గల బంగారం ఆభరణాలు చేయించి ఇస్తారని, ఈ అవకాశాలను విజయవాడ నగర, పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆత్మకూరి అరవింద్‌, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *