-మరో మూడు అవార్డులకు పి.శ్రీనివాస్ గౌడ్, కొమ్మవరపు విల్సన్‌రావు, అవధానుల మణిబాబు ఎంపిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సాహిత్యంలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు అవార్డులను ప్రకటించింది. ‘కలనేత’ కవితా సంపుటితో అడుగులు ప్రారంభించి అసాధారణ వాక్య నిర్మాణం, నిత్యనూతన శైలీ చాతుర్యంతో ఇప్పటికి 14 పుస్తకాలను తెలుగు పాఠకులకు అందించిన సుప్రసిద్ధ కవి,రచయిత బి.ప్రసాదమూర్తికి ప్రధాన అవార్డును అందజేయబోతుంది పౌండేషన్. ఈ అవార్డుకు పదివేల రూపాయల నగదుతో సత్కారం వుంటుంది. ఈ అవార్డుతో పాటు కీ.శే. సత్యవేటి శ్రీకాంత్, తుంగా రాజగోపాల్‌రెడ్డి మరియు నాగభైరవ కోటేశ్వరరావు స్మారక సాహితీ పురస్కారాలను చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ అందజేస్తుంది. ఈ మూడు అవార్డులకు పి.శ్రీనివాస్ గౌడ్, కొమ్మవరపు విల్సన్‌రావు, అవధానుల మణిబాబులను ఎంపిక చేసింది. వీరికి రూ.2,500/-ల నగదుతో సత్కారం వుంటుంది. ఏప్రిల్లో నెల్లూరులో జరిగే ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ఈ అవార్డుల ప్రదానం జరుగుతుంది.
Prajavartha Online Telugu News