విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ ఎదురుగా అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ నూతనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మామిళ్ళపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ రెండవ బ్రాంచ్‌గా గాంధీనగర్‌లో ఐనాక్స్ థియేటర్ ఎదురుగా ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉందని తెలిపారు. మొదటి బ్రాంచ్ రామకృష్ణాపురం బుడివేలు వంతెన దగ్గర ప్రారంభించి భోజనం ప్రియులు ఆధారాభిమానాలతో అభివృద్ధి చెందుతూ దిగ్విజయంగా కొనసాగుతుందని తెలిపారు. ఆస్ఫూర్తితోనే రెండో బ్రాంచ్‌గా గాంధీనగర్‌లో స్టార్ట్ చేశామన్నారు. అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్యూర్ వెజిటేరియన్ కలదని ఏసీ నాన్ ఏసీ సదుపాయాలు కలవన్నారు. బాయ్స్ హాస్టల్ సదుపాయం కూడా కలదని తెలిపారు.
అదేవిధంగా అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో పొద్దున పూట టిఫిన్స్ మధ్యాహ్నం పూట భోజనం సాయంత్రం పూట భోజనం మరియు తందూరి రోట,ి బటర్ నాన్, రోటి పన్నీర్, రోటీతో పన్నీర్ మసాల కర్రీలతో డిన్నర్ సదుపాయం కూడా కలదని తెలిపారు. ప్రత్యేక రోజులలో పనసకాయ బిర్యానీ, పన్నీరు బిర్యానీ, రోటి పచ్చడి, దోస ఆవకాయి తదితర ప్రత్యేక వంటకాలతో భోజన ప్రియులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రెస్టారెంట్ భోజనం అందుబాటులో ఉంటదని తెలిపారు. ఫంక్షన్లకు ఆర్డర్ ప్రకారం క్యాటరింగ్ సదుపాయం కూడా కలగని తెలిపారు. విజయవాడ నగర ప్రాంత ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్‌ని సందర్శించితే మా వంట భోజనం మీ ఇంట భోజనంగా సంతృప్తి చెందుతారని తెలిపారు.
ఈ సందర్భంగా ఆలపాటి రaాన్సీ మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి అన్నపూర్ణ రెస్టారెంట్ భోజనాన్ని తిని ఆశీర్వదించాల్సిందిగా కోరారు.
Prajavartha Online Telugu News