Breaking News

మంత్రి నారా లోకేష్ ఈనెల 10వ తేదీన జిల్లాలో పర్యటన

-జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 10వ తేదీన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది. సోమవారం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి  నారా లోకేష్  సోమవారం అనగా(10.3.25) మధ్యాహ్నం విజయవాడలోని ఉండవల్లి నివాసం నుండి 3.15PM బయలుదేరి సాయంత్రం 4.15 నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుంటారు అక్కడినుంచి విమానాశ్రయంలో బయలుదేరి పుట్టపర్తి విమానాశ్రయానికి సాయంత్రం 5 గంటలకు చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 6.15 నిమిషాలకు కదిరి చేరుకుంటారు, శ్రీ ఖాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, కళ్యాణ ఉత్సవంలో పాల్గొంటారు.  సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు మంత్రివర్యులు రిజర్వుడుగా ఉంటారు, అనంతరం రాత్రి సమయంలో కదిరి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రి 11 గంటలకు చేరుకుంటారు అక్కడి నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *