ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర్థవంతంగా చేపట్టాలి

-సరైన వ్యక్తి సరైన స్థలం ” విధానం అన్న అధికారుల పనితీరు సమీక్షించడం జరుగుతుంది
-ఐ వి ఆర్ ఎస్ ఫిర్యాదుల పరిష్కార విషయంలో సంతృప్తి స్థాయి నూరుశాతం ఫలితాలు సాధించాలి
-సాసా ” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ” కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా అమలు చేయాలి
-జిల్లా నిర్దేశించిన ప్రగతి కి అనుగుణంగా లక్ష్యం సాధించని అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది
-జిల్లా అధికారుల పనితీరుకు నిదర్శనం పిజిఆర్ఎస్ పరిష్కార విధానం
-ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు తీరుపై కీలకమైన పురోగతి చొరవను పర్యవేక్షణ చెయ్యడం జరుగుతుందని జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర మైన్స్ అండ్ జుయాలజి శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు

స్ధానిక కలక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పురోగతి పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డి.నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ లతో కలిసి ప్రత్యేక అధికారి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో నిర్దేశించిన లక్ష్యాలను, మార్గదర్శకాలు జిల్లా స్థాయిలో అమలు తీరును సమీక్షించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన లక్ష్యాలను,  ప్రాధాన్యత కార్యక్రమాలు చేపట్టడం లో నిబద్ధత కలిగి ఉండాలన్నారు. ప్రజా పరిపాలన వ్యవస్థ నేపధ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి ఆరోపణలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐ వి ఆర్ ఎస్ విధానంలో ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఆయా శాఖల ఉద్యోగులు విధులు బాధ్యతలు నేపధ్యంపై ఆరోపణలను స్వీకరించడం జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అధ్వర్యంలో ప్రభుత్వ ప్రాదాన్యత కార్యక్రమాల అమలు తీరుపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ, ప్రజా పంపిణీ వ్యవస్థ, హౌసింగ్ , ధాన్యం సేకరణ – కొనుగోళ్లు, రీ సర్వే, పాట్ హోల్స్ , సంక్షేమ శాఖ పథకాలు అమలు, బ్యాంకు లింకేజ్, మైన్స్, పీజీఆర్ఎస్ , వ్యవసాయ అనుబంధ శాఖలు , పశు సంవర్థక, మత్స్య శాఖ, పరిశ్రమలు, విద్యా శాఖ, పర్యటక, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్ , ఎక్సైజ్ , రెవెన్యూ ఆదాయం పై సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన ప్రగతి కి అనుగుణంగా లక్ష్యం సాధించని అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది

ఈరోజు శాఖల పనితీరు పై రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ల సమావేశంలో సమీక్షించే తీరుకి అనుగుణంగా జిల్లా అధికారులు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు అమలు తీరును సమీక్షించడం జరుగుతుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజలకి అందచేసే బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో ప్రగతి తీరును బట్టి మీ పనితీరును మెరుగు పరచడానికి తగిన సూచనల ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బాధ్యతలను నిర్వర్తించడం లో వెనుకాడవద్దని, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *