Breaking News

జిల్లాలో వాహనాల ఫిట్ సర్టిఫికెట్ కొరకు అధీకృత ఏజెన్సీ

-మెసెర్స్ కంట్రోల్ అల్ట్ ఫిక్స సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జారీ
-డీ టీ సి ఆర్ సురేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో గల భారీ వస్తువుల వాహనం, భారీ ప్రయాణీకుల మోటారు వాహనాలు, మధ్యస్థ వస్తువులు వాహనం, మధ్యస్థ ప్రయాణీకుల మోటారు వాహనం మరియు అన్ని రవాణా తేలికపాటి మోటారు వాహనాల యొక్క వాహనాల ఫిట్నెస్ నిర్వహణ కొరకు రాజానగరం లోని కంట్రోల్ అల్ట్ ఫిక్స సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఇకపై సంప్రదించాల్సి ఉంటుందని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

జిల్లాలో అన్ని రకములైన రవాణా వాహనములకు చేయు ఫిట్నెస్ నిర్వహణ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్య రవాణాశాఖ వారి చే జారీ చేయబడిన నోటిఫికేషన్ నెంబరు 18021/4/2024/RSC-2, Dated 07-03-2025 మరియు 12.09.2025 మోర్తా జి ఎస్ ఆర్ 663 (ఇ ) లో పేర్కొన్న సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 లోని రూల్ 62 లోని సబ్-రూల్ (1) లోని క్లాజ్ (బి) ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని అన్ని వాహనాలు అంటే భారీ వస్తువుల వాహనాలు, భారీ ప్రయాణీకుల మోటారు వాహనాలు, మధ్యస్థ వస్తువుల వాహనాలు, మధ్యస్థ ప్రయాణీకుల మోటారు వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాలకు సిఎంవి నియమాలు, 1989 ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ లేదా పునరుద్ధరణ ప్రయోజనం కోసం “సర్వే నం- 31, తూర్పు గోనగూడెం గ్రామం, రాజనగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా” వద్ద, MV చట్టంలోని సెక్షన్ 56(2) కింద ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ నందు కంట్రోల్ అల్ట్ ఫిక్సు సొల్యూషన్ ప్రవేటు లిమిటెడ్ (M/s. Control Alt fix solution pvt Ltd) వారిచే పరీక్షించబడతాయని , వారి ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ లని జారీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు.

కావున మార్చి 14 వ తేదీ నుంచి జిల్లాలో రవాణా వాహనదారులు ఆయా వాహనాలకు చెందిన ఫిట్నెస్ సర్టిఫికెట్లు పైన తెలిపిన అడ్రసు నందు చేయించు కోవలసినదిగా వాహన యజమానులకు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలియ చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర, జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫిట్నెస్ సర్టిఫికెట్లు పైన తెలియ చేసినా ఏజెన్సీ నిర్వాహకులు తనిఖీలు నిర్వహించి ధ్రువపత్రాలనీ జారీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *