డ్రైన్ల ఆక్రమణలను పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పట్నం బజార్, లాలాపేటల్లో డ్రైన్లు పూర్తి స్థాయిలో ఆక్రమణలు చేసుకోవడం వలన వర్షాకాలం సదరు ప్రాంతం ముంపుకు గురవుతుందని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోకుంటే జిఎంసి పట్టణ ప్రణాళిక విభాగం తొలగిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ గారు హిమని సెంటర్, పట్నం బజార్, లాలాపేట, పూల మార్కెట్ సెంటర్, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయం, బృందావన్ అపార్ట్మెంట్, చాకలి గుంట వరకు పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలను నేరుగా పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గాంధీ పార్క్ నుండి పట్నం బజార్ నుండి బృందావన్ అపార్ట్మెంట్ వరకు ఉన్న డ్రైన్ పూర్తి స్థాయిలో వ్యాపారస్తుల షాప్ లు ముందుకు రావడం వలన ఆక్రమణకు గురై మురుగు పారుదల లేక, వర్షాకాలంలో నీరు నిలిచి స్థానిక వ్యాపారులే ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యాపార సంస్థలు వ్యర్ధాలను డ్రైన్ లోకి వేస్తున్నారన్నారు. త్వరలో పట్నంబజార్ లో డ్రైన్ల ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామన్నారు. డ్రైన్ ఆక్రమణ చేసుకున్న వారు స్వచ్చందంగా తొలగించుకోవాలన్నారు. డ్రైన్లలో వ్యర్ధాలు వేసే సంస్థలపై భారీ అపరాధ రుసుం విధిస్తామన్నారు. గాంధీ పార్క్ నుండి పట్నం బజార్ వైపు కల్వర్ట్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిఈఈని ఆదేశించారు. బృందావన్ అపార్ట్మెంట్ వద్ద డ్రైన్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని, చాకలి గుంట రోడ్ 100 అడుగులకు విస్తరణ చేసిన అనంతరం జరిగిన ఆక్రమణల తొలగింపు చేపట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. చాకలి గుంట ప్రాంతంలో మినరల్ వాటర్ ప్లాంట్ ని పరిశీలించి, ప్లాంట్ అనుమతులు పరిశీలించి, ప్లాంట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గాంధీ పార్క్ దగ్గరలోని పబ్లిక్ టాయ్ లెట్స్ ని పరిశీలించి, అధికంగా రుసుం వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు. టాయ్ లెట్స్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నిర్వహకులు సరిచేసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పర్యటనలో కార్పొరేటర్లు సంకూరి శ్రీనివాసరావు, వేముల జ్యోతి పద్మజ, డిఈఈ నాగభూషణం, బయాలజిస్ట్ రామారావు, ఎస్ఎస్ లు ఆయూబ్ ఖాన్, రాంబాబు, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *