Breaking News

జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ప్రజల జీవనోపాదులను మెరుగుపర్చి పేదరికాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలకు, పరిశ్రమల ప్రోత్సాహానికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆర్ధిక అభివృధ్ది రేటులో జిల్లాను ముందంజలో ఉండేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన డిసెంబరు త్రైమాసికంకు సంబంధించిన జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సమావేశం (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం (డీఎల్ఆర్సీ) సమావేశం జరిగింది. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2024 – 25 లో భాగంగా 2024 డిసెంబరు 31 త్రైమాసికం వరకు సాధించిన పురోగతి వివరాలను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ కి లీడ్ బ్యాంక్ మేనేజరు మహిపాల్ రెడ్డి తెలియజేస్తూ వ్యవసాయరంగానికి రూ.13,613.86 కోట్ల రుణ లక్ష్యానికి రూ. 12,565.67 కోట్లు (92.30శాతం), ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 9,495.21 కోట్లు రుణ లక్ష్యానికి 8,792.15 కోట్లు (92.59 శాతం) మొత్తంగా ప్రాధాన్యతా రంగానికి రూ. 24,501.93 కోట్ల రుణ లక్ష్యానికి రూ. 21,855.44 కోట్ల (89.19 శాతం) సాధించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక భధ్రతా పథకాలు పీ ఎం ఎస్ బీ వై, క్రింద 54,883 నమోదు చేసుకోగా, పీ ఎం జే జే బీ వై క్రింద 27,452 మంది నమోదు చేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ రుణ పథకాలైన పీఎం విశ్వకర్మ పథకంలో 2025 మార్చి 7 తేది నాటికి 417 మందికి రుణాలు అందజేసినట్లు, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 1041 మందికి రుణాలు ఇచ్చినట్లు, పీఎంఈజీపీ పథకం ద్వారా 112 మంది లభ్దిదారులకు (110 శాతం లక్ష్యం సాధించినట్లు) అలాగే పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా 31 మంది లభ్దిదారులకు రుణాలు అందించినట్లు తెలిపారు. సమావేశం అజెండా అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలోను ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో రాయితీతో స్వయం ఉపాధి పధకాల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నందున దీనికి అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా రాజధాని ప్రాంతంలో భాగమైనందున పరిశ్రమల ప్రోత్సాహానికి సంబంధించి ఎక్కువ అవకాశం ఉన్నందున బ్యాంకర్లు విరివిరిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. కౌలు రైతులకు తప్పనిసరిగా అన్ని బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంకు నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలన్నారు. కౌలు రైతులకు రుణాలు మంజురులో చాలా బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించటంలో వెనుకబడి ఉన్నాయన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను గమనించి వ్యవసాయ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. భూ యజమానులకు కాకుండా పొలం సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రమే పంట రుణాలు బ్యాంకర్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా అన్నిరంగాల్లో 15 శాతం పురోగతిని సాధించటానికి బ్యాంకర్లు సహకరించేలా ప్రణాళిక చేసుకోవాలని, వ్యవసాయరంగ ఆధారిత పరిశ్రమలకు అనుబంధ రంగాలకు సేవా రంగాలకు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన వాటికి రుణాలు అందజేయాలన్నారు. మహిళలను లక్ పతీ దీదీలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి చేయుత నిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేశారు. ప్రభుత్వం రాయితీతో బీసీ, ఎస్సీ, ఈడబ్యుఎస్, మైనార్టీలకు స్వయం ఉపాధి పథకాలకు ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లను సమన్వయం చేసుకొని అర్హులను గుర్తించి నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆమోదించిన యూనిట్లకు రుణాలు మంజూరు చేసి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో డీసీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ డీజీఎం, రీజనల్ హెడ్ ఎస్ జవహర్, ఆర్బీఐ ఎల్డీఓ నవీన్ చిరినేల్లి, నాబార్డు డీడీఎం జి శరత్ బాబు, లీడ్ బ్యాంక్ మేనేజరు మహిపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా పశుసంవర్ధకశాఖ జెడీ నరిసింహారావు,జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీందర్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మీ, మెప్మా పీడీ విజయలక్ష్మీ, జిల్ రైతుల సంఘం కార్యదర్మి కంచుమాటి అజయ్ కుమార్, సిక్కీ రీజినల్ హెడ్ పరిమళ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *