Breaking News

రీసర్వే ప్రక్రియ తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సంయుక్త కలెక్టర్, గుంటూరు A.భార్గవ్ తేజ IAS వారు రీసర్వే ప్రక్రియ తనిఖీ లో భాగంగా పొన్నూరు మండలం నందు రీసర్వే పైలేట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన వల్లభరావుపాలెo గ్రామమును సందర్శించారు. ప్రభుత్వ భూముల సరిహద్దుల రీసర్వేలో భాగముగా బ్లాకు నెం.10లోని సర్వే నెం.430 సరిహద్దులను రోవర్ల ద్వారా తిరిగి నిర్ధారించే క్రమమును పరిశీలించారు. మరియు బ్లాకు నెం.4లోని సర్వే నెం.127 నందలి య.7.63 సెంట్లు విస్తీర్ణము గల లాంగ్ నారోఫీల్డ్ లను రోవర్ల ద్వారా సరిహద్దులు నిర్ణయించే క్రమమును పరిశీలించారు. తదుపరి రీసర్వే టీములతో మరియు సిబ్బంది తో వల్లభరావుపాలెం పంచాయితీ కార్యాలయము నందు మీటింగ్ నిర్వహించి గ్రామ రెవిన్యూ అధికారులు చేయుచున్న FPOLR పనితీరును మరియు గ్రామ సర్వేయర్లు చేయుచున్న QGIS సాఫ్ట్వేర్ నందు రోజువారీ పని తీరును పరిశీలించి గ్రామ రెవిన్యూ అధికారులకు , గ్రామ సుర్వేయర్లకు, మండల సయ్వేయర్కు, డిప్యుటీ తహసీల్దార్ మరియు తహసీల్దార్ వారికి రీసర్వే త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా తగు సూచనలు జారీ చేసియున్నారు. సదరు కార్యక్రమములో పి.పార్థసారధి, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, తెనాలి వారు, యండి.జియావుల్హక్, తహశీల్దార్, పొన్నూరు మరియు తదితర రిసర్వే సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *