Breaking News

సాగు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు.

-ఇరిగేషన్, రెవిన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి.
-ఎస్ఈ నుండి కింది స్దాయి అధికారులు వరకు క్షేత్రస్దాయిలో పర్యటించాలి.
-జలవనరుల శాఖ అధికారులతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి నిమ్మల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాగునీటి సరఫరా లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తురాదని రబీ సీజన్ మరో పది, పదిహేను రోజుల్లో ముగుస్తుండటంతో కాలువల ఆయకట్టు చివరి రైతులకు సాగు నీరందించేందుకు వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను, కలెక్టర్లను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఆయన శుక్రవారం జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, జిడిఎస్, కర్నూలు, ఒంగోలు జిల్లాల సిఈలతో పాటు వారి పరిధిలోని ఎస్ఈలు, ఈఈ లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయుకట్టు, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల ఆయుకట్టు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఆయుకట్టు పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని మంత్రి రామానాయుడు ఆదేశించారు.

నంద్యాల, పల్నాడు, ప్రకాశం, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్ల తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి రామానాయుడు, సాగునీటి సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్యయం చేసుకుంటూ వారాబంది పగడ్బందీగా నిర్వహిస్తూ, ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. రబీ సీజన్ ముగుస్తుండడంతో ఎస్ఈ స్థాయి అధికారుల నుంచి, ఈఈ లు, డిఈఈ లు, ఏఈఈ ల వరకు క్షేత్రస్థాయిలో ఉండి సాగునీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రబీ పంటకు రానున్న పది, పదిహేను రోజులు ఎంతో కీలకం అని, రైతులకు సాగునీరు అందించే విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. కాలువల పూడికలు, తూడు, లాకుల మరమ్మత్తులు వంటి సమస్యలను అధిగమించి రైతుల పంటను కాపాడాలని మంత్రి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *