Breaking News

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాల బృందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీ నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన పలువురు అధికారులతో కూడిన బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో సమావేశం అయింది.మేజర్ జనరల్ సిపి సంగ్ర(Sangra)AVSM YSM(rtd) నేతృత్వంలోని ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఆర్డిఓ తదితర విభాగాలకు చెందిన అధికారుల బృందం వారి స్టడీ టూర్ లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా సిఎస్ తో సమావేశం కావడం జరిగింది. ఈసందర్భంగా ఆబృందం ప్రతినిధులు రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సిఎస్ ను అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను వారికి వివరించారు.ముఖ్యంగా స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు పది సూత్రాల ప్రణాళిక ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అదే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో సాంకేతిక వినియోగం గురించి సిఎస్ విజయానంద్ వారికి వివరించారు.ఇటీవల రాష్ట్రంలో వాట్సాప్ గవర్నైస్ ప్రవేశపెట్టి ప్రజలకు ఏవిధంగా సులభంగా పౌర సేవలు అందింస్తుందీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉందని తీర ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ నూతన ఓడరేవుల నిర్మాణం, గ్రీన్ హైడ్రోజన్,గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల గురించి సిఎస్ విజయానంద్ ఎన్డిసి ప్రతినిధి బృందానికి వివరించారు.

రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా,సర్వీస్ సెక్టార్,తయారీ రంగం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కానుందని తెలిపారు. అందుకనుణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నట్టు తెలిపారు.అంతేగాక వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున సాంకేతికత వినియోగం, ఉద్యాన వనరంగం,ప్రకృతి సేద్యం వంటి రంగాల్లో దేశంలో ఎపిని మొదటి స్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషిని సిఎస్ వారికి వివరించారు. రాష్ట్రంలో వివిధ ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు ఆర్మీ,నెవీ, ఎయిర్ ఫోర్స్,ఎన్డిఆర్ఎఫ్ తదితర కేంద్ర రక్షణ దళాలు రాష్ట్రానికి ఎనలేని సేవలు అందిస్తు న్నాయని పేర్కొన్నారు. ఉదాహరణకు విశాఖపట్నంలలో హుద్ హుద్ తుఫాను సమయంలో వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడులోను,గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల్లోను రక్షణ దళాలు అందించిన సేవలను సిఎస్ విజయానంద్ వారికి గుర్తు చేశారు.

నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న మేజర్ జనరల్ సిపి సంగ్ర మాట్లాడుతూ తమ కళాశాల వివిధ విభాగాలకు చెందిన 16 మంది అధికారులతో కూడిన బృందం స్టడీ టూర్ లో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతోందని తెలిపారు.వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు,రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను వాటి కార్యకలాపాలు ఈ బృందం అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు.

ఈసమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన మేజర్ జనరల్ సిపి సంగ్ర సహా వివిధ విభాగాలకు చెందిన బ్రిగేడియర్లు మన్జీత్ సింగ్, మునీస్ చంద్ర తమాంగ్, అతుల్ రాజ్ ఫుత్,సందీప్ కుమార్ రాకేశ్,అమితోష్ సింగ్,కెఎస్ పుష్ప కుమార, కంమాండర్లు,కల్నల్ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *