తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ వాటర్ డే సందర్బంగా నేటి శనివారం జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ చేతుల మీదుగా కలెక్టరేట్ నందు వాటర్ బ్రోచర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేచురల్ మినరల్ డ్రింకింగ్ వాటర్ (ఎటువంటి కెమికల్, మినరల్స్ కలపకుండా ) అందరికి అందుబాటులో ఉండాలని, ప్రజలు ఆరోగ్యకరమైన నీటిని త్రాగాలని తెలిపారు. అదేవిదంగా IIT-Tirupati ప్రొఫెసర్ అండ్ CDI వాటర్ ను కనుగొన్న సైంటిస్ట్ అయిన Dr. షిహాబుద్దీన్ ని అభినందించారు. అనంతరం MEPMA PD , DRDA PD కి CDI వాటర్ యూనిట్లు పెట్టి మహిళలకు ఉపాధి కల్పించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లౌడ్ టీమ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ రాజేంద్ర నాథ్ రెడ్డి, ప్రసాద్ మరియు NGEN – IIT ఇంకుబ్యేషన్ కంపెనీ రమేష్ మరియు అర్జున్ రాజ్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News