తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 25 మరియు 26 తేదీలలో అమరావతి నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తో కలసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 25,26 తేదీలలో అమరావతి నందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించే సమీక్ష సమావేశానికి జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన 8 పేజీల ఫార్మేట్ లోనే 2025 -26 సంవత్సరానికి వివిధ శాఖలు తయారు చేసిన యాక్షన్ ప్లాన్ కు సంబంధించి వారు అందజేసిన నివేదికలపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. క్లుప్తంగా పూర్తి సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశములో సిపిఓ, ప్రేమ్ చంద్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News