సంకల్ప మెగా జాబ్ మేళా కు విశేష స్పందన

-నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది
-జాబ్ మేళా లని సద్వినియోగం చేసుకోవాలి
-జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప – జాబ్ మేళా లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళా ను జెసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి , జిల్లా ఉపాథి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మెగా జాబ్ మేళాలో 36 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు . వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్.ఎస్.సి, ఐటీఐ, సీ ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీ.టెక్, ఎం.టెక్, ఫార్మసీ, ఎం.బి.ఎ, ఎం.కాం తదితర కోర్సులు పూర్తిచేసిన 19 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులైన అభ్యర్థుల ఎంపికపై జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళా కు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరవడం జరిగిందన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిత్యం నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విజిడి మురళి, జిల్లా ఉపాథి కల్పన అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్ రామచంద్ర రావు, పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *