Breaking News

బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి  చిన్నారులకు రక్షణ కల్పించేందుకు రూపొందించిన చట్టం  పోక్సో..

-పోక్సో చట్టం, బాధితుల పరిహార పథకంపై అవగాహనా కోసం డిఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో కార్యాశాల నిర్వాహణ
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల బాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం  పోక్సో చట్టం (POCSO Act) రూపొందించడం జరిగిందనీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు NALSA & APSLSA నేత్రుత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం పై వర్క్‌షాప్ ను పోలీస్, మహిళా శిశు సంక్షేమ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ  ఆధ్వర్యంలో   నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం, రక్షణ కల్పించడం కోసం పోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఫోక్సో చట్టం

(Protection of Children from Sexual Offenses Act,) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారన్నారు. NALSA & APSLSA ఆధ్వర్యంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం, తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లల కేసులపై సంబంధిత శాఖల వారికీ అవగాహనా (సెన్సిటైజేషన ప్రోగ్రామ్) కార్యక్రమం అన్నారు. 2018లో లైంగిక వేధింపులు మరియు ఇతర నేరాల బాధితులు/బతికి ఉన్నవారి కోసం నల్సా పరిహారం పథకంపై అవగాహనతో కూడిన వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోక్సో యాక్ట్ ను అమలు చేస్తున్న ప్రతి అధికారికి యాక్ట్ పై అవగాహన ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో ఒక ఫోక్సో కోర్టు పెట్టవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి కోర్టులో వెయ్యి వరకు ఫోక్సో కేసులు డిస్పోజల్ చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ఫోక్సో కోర్టు కాకినాడలో ఉండగా జిల్లాలో మరో కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగిందన్నారు. ఉదాహరణకు ఇటీవలి జరిగిన ఒక సంఘటనలో తండ్రి సొంత కుమార్తె పై చేసిన అఘాయిత్యం కేసు వివరాలను తెలియజేసి అవగాహన కల్పించారు. 14 సంవత్సరాలు లోపు గల బాలికలకు ఫోక్సొ చట్టం ద్వారా పూర్తి న్యాయాన్ని అందించేందుకు జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నియమించిన మీ అందరూ పూర్తిస్థాయి అవగాహన కలిగి రక్షణ చర్యలు చేపట్టే విధంగా ఉండాలన్నారు. సంఘటన జరిగిన బాలికలకు ఫోక్సొ చట్ట ప్రకారం పరిహారంతో పాటు న్యాయ సంరక్షణ బాధితులైన వారి సంరక్షణ వంటి బాధ్యతలను చేపట్టాల్సి ఉందన్నారు. కార్యసాలలో భాగంగా మోటార్ వెహికల్ చట్టంలో సవరించిన నిబంధనలపై మరియు వాటికీ చెందిన ఎమ్ వి రూల్స్, 2022లోని సవరణలపై సంబంధిత శాఖల వారికీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ వర్క్ షాప్ లో 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్.శివ కుమార్, 10 వ అదనపు జిల్లా జడ్జి ఆర్.శ్రీలత, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, , అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్. అర్జున్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె.విజయ కుమారి, పోలీస్ అధికారులు , ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *