-జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.
-ఆరుగాలం శ్రమించే అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.
-నీటి కుంట కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
-ఫామ్ ఫాండ్ నిర్మించుకుందాం – వర్షపు నీటిని సంరక్షించుకుందాం – అధిక పంట దిగుబడులు పొందుదాం.
-తోకాడ గ్రామంలో పంట సంజీవిని ఫామ్ పాండ్స్ కార్యక్రమంలో పాల్గొన్న..
-మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రైతన్నలకు రక్షణగా నిలబడాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అందులో భాగంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. వర్షపు నీటి బొట్టును వడిసి పట్టి సాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన సేద్యపు కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నీటి కుంటల ఏర్పాటు ద్వారా నీటి ఎద్దడి తగ్గటంతోపాటు, అడుగంటి పోతున్న భూగర్భజలాలు సైతం బాగా పెరుగుతాయని సూచించారు.తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయాలన్న విధానానికి శ్రీకారం చుడుతూ రాజానగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైతులు కూడా నీటి కుంటలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. ప్రతి పొలంలో చిన్నపాటి నీటి కుంటలను నిర్మించే క్రమంలో ఏ ఫాండ్ కు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి మెటీరియల్ ఖర్చుతో పాటు లేబర్ ఖర్చును ప్రభుత్వం తరపున ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా సహకారం అందించనున్నామన్నారు. తద్వారా పొలాలు పండించేందుకు అవసరమైన నీటిని నిల్వ చేసుకోవచ్చన్నారు.అదే విధంగా పాడికి అవసరమైన నీటిని అందజేయవచ్చన్నారు. అదే విధంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ) విధానంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను ఎంపిక చేసి అక్కడ చెరువులు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేసి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంటకుంటలు, పంట సంజీవిని పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రారంభించుకుంటున్నమన్నారు.
నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ పశువులు యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుందన్నారు. తద్వారా పంటలు బాగా పండటంతో భూమి విలువ పెరుగుతుందన్నారు. వర్షపు నీటిని విలువ చేసుకోవడం వలన భూగర్భ జలాలు అభివృద్ధి చెంది నేల సారవంతం అవడంతో పాటు పంటలు బాగా పండుతాయన్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే మనం ఎక్కువ ఉష్ణోగ్రత వలన బయటకు రాలేని పరిస్థితి కూడా ఉందన్నారు. నీరు ఆవిరిగా మారటం వలన భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు కూడా ఎక్కువ లోతు తీయవలసిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా ఇంకుడు గుంటలను తీయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఫామ్ ఫాండ్స్ ను ఉచితంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతుకు వారి పొలంలో రు. 44 వేల రూపాయలు విలువ గల ఫామ్ ఫాండ్స్ ను అందిస్తున్నామన్నారు. రైతు తన పొలానికి సంబంధించి నీటిని స్టోరీ చేసుకొని పంటలు పండించు కోవడంతో పాటు పశువుల దాహార్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ యొక్క అవకాశాన్ని సన్న చిన్న కారు రైతులందరూ కలెక్టర్ సూచించారు. పండ్ల తోటల పెంపకం రైతులు ఫామ్ ఫాండ్స్ కు మూడు సంవత్సరాల మెయింటెనెన్స్, వాటర్ సప్లై చార్జెస్ మరియు పండ్ల మొక్కలు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది అన్నారు. రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమ్యూనిటీ ఫామ్ ఫాండ్స్ కు సంబంధించి పంచాయితీ, ఇరిగేషన్, రెవెన్యూ స్థలాల్లో 20×20 విస్తీర్ణంలో ఫామ్ ఫాండ్స్ ను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భూగర్భ జలాల లభ్యతను పెంపొందించే విధంగా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా నీటి లభ్యతను చేకూర్చే విధంగా పంట సంజీవని ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుధూర ప్రాంతాల నుండి తమ పశువులకు, మొక్కలకు వీటిని ట్యాంకర్ల రూపంలో లేకుండా పంట సంజీవిని కార్యక్రమం ద్వారా ఫామ్ ఫాండ్స్ ను ఏర్పాటు చేసుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలోని తోకాడ గ్రామానికి చెందిన వ్యక్తికి తొలి గృహనిర్మాణ లోన్ మంజూరు అయిందని దీనికి సంబంధించిన చెక్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ తో కలిసి మంత్రి దుర్గేష్ అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News