తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉల్లాస్ అసెస్మెంట్ టెస్ట్ తిరుపతి జిల్లా వ్యాప్తంగా 23వ తేదీ ఆదివారం జరిగింది. ఈ పరీక్షకు 12,085 మంది సెల్ఫ్ నిరక్షరాస్య మహిళలు హాజరయ్యారు. ప్రాథమిక అక్షరాస్యత, డిజిటల్ లెర్నింగ్, మరియు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ పొందిన 11,978 మంది మహిళలు ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ రాశారు. ఉత్తీర్ణత సాధించిన మహిళలకు NIOS (National Institute of Open Schooling) ద్వారా ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేయనున్నారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. స్టేట్ లెవెల్ అబ్జర్వర్లు ఏ. గోపాలకృష్ణ మరియు వేణుగోపాలకృష్ణ పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. వయోజన విద్యాశాఖ మరియు సెర్పీ సిబ్బంది అందించిన సహాయానికి ప్రత్యేక అభినందనలు నోడల్ ఆఫీసర్ ప్రసాద్ తెలియజేశారు.
Prajavartha Online Telugu News