అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రూ.7 కోట్లతో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఏరియా ఆస్పత్రిని సీనియర్ నాయకులు, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తో కలసి ప్రారంభించాను. ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన వార్డులు, గదులను పరిశీలించాను. హాస్పిటల్ లో అత్యాధునిక డయాగ్నసిస్ పరికరాలు సమకూర్చడంలో కృషిచేసిన కన్నా లక్ష్మీ నారాయణ గారికి ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ లో ఒక దానిని సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెంలో నిర్మించనున్నాం. అలాగే రూ.36 కోట్లతో నరసరావుపేటలో క్రిటికల్ కేర్ బ్లాక్ ను అందుబాటులోకి తీసుకురానున్నాం. అలాగే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీని ఏడాదిన్నర లోగా పూర్తిచేస్తాం”
Prajavartha Online Telugu News