-ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
-డాక్టర్ ఎన్ .వసుంధర
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా లో క్షయ వ్యాధి లక్ష్యాలు ను ఆదిగమించడం తో పాటు వ్యాధి గ్రస్తులను ముందగా గుర్తుంచి త్వరితగతిని చికిత్స అందించడం వలన క్షయ వ్యాధి క్రమేపి తగ్గు ముఖం పడుతోందని త జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారిణి డాక్టర్ ఎన్. వసుంధర ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
జిల్లా లో ప్రస్తుతం 2864 మంది సాధారణ క్షయ వ్యాధి గ్రస్తులు, 47 మంది మొండి క్షయ వ్యాధి గ్రస్తులు ఉన్నారన్నారు . జిల్లా లో గత మూడేళ్ళ గణాంకాలు పరిశీలిస్తే :ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల ల్లో నమోదు అయిన క్షయ వ్యాధి గ్రస్తుల వివరాలు 2022 లో 3098 టీబీ కేసులు, 2023 లో 2905 టీబీ కేసులు, 2024 లో 2817 కేసు నమోదు అయ్యాయని తెలిపారు . అదేవిధంగా ఈ మూడేళ్ళ లో మరణాల సంఖ్య కూడా మూడు శాతం నుండి 1.5 శాతానికి తగ్గిందన్నారు .
ప్రతి హెల్త్ వెల్నెస్ సెంటర్ లో టీబీ స్క్రీనింగ్ :
ప్రతి గ్రామా పంచాయతీలు లో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్ ల్లో టీబీ అనుమానితులు ఉన్న ప్రాంతాలు అంటే మురికి వాడలు, ఇటుక బట్టీలు, కుటీర పరిశ్రమలు , వృద్ధ ఆశ్రమాలు, గురుకుల పాఠశాలలు తదితర ప్రాంతాలను గుర్తించి అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
వ్యాధి నిర్దారణ అధునాతన యంత్రాలు :క్షయ వ్యాధి నిర్దారణ కొరకు జిల్లా లో ఒక CBNAAT యంత్రం , 25 truenaat యంత్రాలు , 28 మైక్రోస్కోపీ యంత్రాలు ఉన్నాయనీ, ఎనిమిది టీబీ యూనిట్ ల్లో 35 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వం లో టీబీ రహిత గ్రామ పంచాతీయలే మా ధ్యేయం :
జిల్లా లో 2023 సంవత్సరం లో 109 గ్రామపంచాయతీ లు రజత మెడల్ కు ఎంపిక అయ్యాయి అని వాటి లో 2025 సంవత్సరానికి 77 సిల్వర్ మెడల్ కు ఎంపిక అయ్యాయని చెప్పారు . వరసగా మూడో సంవత్సరం కూడా 77 పంచాయతీలు నామినేషన్ కి వెలితే గోల్డ్ మెడల్ సాధించిన పంచాయతీ లు గా నిలుస్తాయి అని ఆశ భావం వ్యక్తం చేసారు .
టీబీ కళంకం పై అవగాహనా కార్యక్రమాలు :
క్షయ వ్యాధి పై సమాజం లో ఉన్న సోషల్ స్టిగ్మా పై కళాశాల విద్యార్థుల చే అవగాహనా సదస్సులు ర్యాలీలు , వ్యచరచన పోటీలు ముగ్గుల పోటీలు పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించా మన్నారు.
మార్చి 24 న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల లో ఏర్పాటు చేసిన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా క్షయ రహిత గ్రామా పంచాయతీలకు, వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు, టీబీ నివారణ కోసం పాటుపడిన సేవకులు కు కలెక్టర్ చేతుల మీదగా బహుమతి ప్రదానం జరుగుతుంది అని డాక్టర్ వసుంధర పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News