బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం

-ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 94 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే
-ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర నివేదిక సేకరణ
-గృహ సర్వే ద్వారా ఖచ్చితమైన క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు తగిన సమాచారం సేకరణ చేపడుతున్నాం
-క్యాన్సర్ కేసుల సర్వే నేపధ్యంలో బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
-ప్రజల లో ఉన్న అపోహలు తొలగించడం కొరకు ప్రజల లో అవగాహన కల్పించి అనుమానిత కేసులు వెంటనే స్క్రీనింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి
-హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా కే. పద్మావతి

అనపర్తి (బలభద్రపురం),  నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం రెండవ రోజు బలబద్రపురం సచివాలయం-3 లో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కె పద్మావతి సందర్శించడం జరిగింది. శిబిరంలో ఉన్న వైద్యులను మరియు సిబ్బందితో ఆమె సమావేశం ఏర్పాటు చేసి అనుమానిత కేసులను ఖచ్చితమైన సమాచారాన్ని గుర్తించి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా సర్వే బృందాల వారు వెళుతున్నటువంటి ప్రతి ఇంటింటికి వెళ్లినప్పుడు వైద్యాధికారులు మరింత ఎక్కువ సమాచారం సేకరించడం కొరకు ఖచ్చితమైన కారణాలను కనుగొనాలని సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా డైరక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ డా పద్మావతీ మాట్లాడుతూ అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించడానికి మరికొన్ని రోజులు ఇక్కడ శిబిరాన్ని నిర్వహించడం జరుగు తుందన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల చేత క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించి నిర్ధారణ పరీక్షల ద్వారా కేసులను గుర్తించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిఎస్ఎల్ ఆసుపత్రి మరియు ఒమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రత్యేక వైద్య సిబ్బంది నిపుణుల చేత ఏర్పాటు చేయబడుతున్నదని అనుమానితా క్యాన్సర్ కేసులను స్క్రీనింగ్ ద్వారా గుర్తించి తదుపరి కేసులకు తీసుకోవలసిన ఫాలో అప్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

జిల్లా వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్ అఫ్ హెల్త్ డా కే. పద్మావతి మరిన్ని సూచనలు ఇస్తారని తెలియ చేశారు.

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ పి సుజాత మాట్లాడుతూ మెడికల్ కళాశాల నుండి ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని తీసుకుని వచ్చి రెండు రోజులుగా గృహ సందర్శనలో జరిపి అనుమానిత కేసులను గుర్తించుతున్నామని తెలియజేశారు. గత రెండు రోజులుగా 2803 గృహాలను సందర్శించి 8,830 మంది ని పరిక్షించినట్లు తెలియ చేశారు. తొలి రోజు 1608 గృహాల సందర్శనలో 4,993 మందిని, రెండోవ రోజు 1195 గృహాలను సందర్శించి 3,837 మందిని పరిక్షించినట్లు తెలిపారు. ప్రాథమికంగా క్యాన్సర్ లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి, పరీక్షల తర్వాత నిర్ధారణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానంతరం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కె పద్మావతి బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులలో ఉన్న అనుమానిత క్యాన్సర్ల వివరాలని తనిఖీ చేయడం జరిగింది. అంకాలజిస్టు సూచనలు సలహాలు మేరకు తగిన వైద్య చికిత్స అందజేయడం జరుగు తుందన్నారు. ఇందుకు సమన్వయ శాఖల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రోటోకాల్ ను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసుల నమోదు నేపధ్యంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రాథమిక దశలో క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తే చికిత్స పొందడం ద్వారా సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకుంటారని పేర్కొన్నారు.

స్ధానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైద్యాధికారులతో సమావేశం అయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *