-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాయలసీమలోని కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో కురిసిన అకాల వర్షాలవల్ల పలుచోట్ల ఉద్యానవన పంటలకు జరిగిన నష్టాన్ని ఆంచనా వేసి నష్టపరిహారం రైతాంగానికి సత్వరం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు నేడొక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సుమారు 10 మండలాల్లో 50 గ్రామాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలవల్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాధమిక అంచనా ప్రకారం సుమారు 15 వందల మంది రైతులకు చెందిన 2000 హెక్టార్లలో పంటలు ధ్వంసమైయ్యాయని వారు అన్నారు. పంటలు నష్టపోయి ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం స్పందించటంపై హార్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖామంత్రి స్పందించినత వేగంగా రైతాంగాన్ని ఆదుకోవాలని జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు డిమాండు చేశారు.
Prajavartha Online Telugu News