Breaking News

ఆరోగ్య చికిత్స కేంద్రంకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేణిగుంట-౩ గ్రామ సచివాలయం ఆరోగ్య చికిత్స కేంద్రంకు (VHC)వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందజేయాలని డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ కార్యక్రమం అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. రేణిగుంట మండల పీహెచ్పీ పరిధిలోని రేణిగుంట-3లో గల ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు.గ్రామంలో గర్భవతులకు వైద్య పరీక్షలు చేయించారు. గర్భధారణ-సంరక్షణ, ప్రసవం తర్వాత తల్లి మరియు బిడ్డ సంరక్షణ, యుక్త వయస్సు లో జాగ్రత్తలు, సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు జీవనశైలి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వారి కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి మాతృత్వ వందనయోజన,జనని ఆరోగ్య సురక్ష వంటి వివిధ రకాల ఆరోగ్య పథకాలను వివరించారు. హాజరైన గర్భవతులను, బాలింతలను వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.తల్లి బిడ్డల ఆరోగ్యం కొరకు తీస్కోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు.0-5 సంవత్సరాల చిన్నారుల ఆరోగ్యం తీసుకోవాల్సిన వివిధ జాగ్రత్తలపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.సీజనల్ వ్యాధులు డయేరియా, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత ఆవశ్యకత గురించి వివరించారు. కేంద్రంలో గల పలు రికార్డ్ లు తనిఖీ చేశారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షించారు. DPMO డాక్టర్ శ్రీనివాసులు  ఆధ్వర్యంలో,డాక్టర్ ఛత్రప్రకాష్ రెడ్డి,స్టాటిస్టికల్ ఆఫీసర్ నాగేంద్ర కుమార్, DPO ప్రకాష్,CHO హైమావతి,సూపర్వైజర్ నరేష్,MPHS(F) అనూరాధ, MLHPలు, ANMలు ఆశాకార్య కర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *