Breaking News

ప్రతి రైతుకూ గుర్తింపు సంఖ్య – జిల్లా వ్యాప్తంగా రైతు రిజిస్ట్రీ

-వ్యవసాయ శాఖ, తిరుపతి జిల్లా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతు (ఫార్మర్) రిజిస్ట్రీ అమలు ప్రక్రియ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతీ రైతుకు 11 నెంబర్లతో యూనిక్కోడ్ (యూసీ) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలై జేషన్ చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టును కేం ద్రం చేపట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయనున్నారు.
ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే..
ప్రస్తుతం భూ యజమానులకు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ జరుగుతోంది. తొలుత పీఎం కిసాన్ లబ్ది దారులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్లు జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన భూ యజమానులకు జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిం చిన పథకాలు పొందాలంటే భూ యజమానులు తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావా ల్సిందే.

రిజిస్ట్రీ ఎలా…
రిజిస్ట్రీ కోసం ఏపీఎఫ్ఆర్ఆ గ్రిస్టాక్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్) అనే వెబ్సైట్ను రూపొందించారు. దీన్ని వెబ్ ల్యాండ్, గిరిభూమి తదితర భూసం బంధిత వెబ్సైట్ లతో అనుసంధానించారు. ఈ వెబ్సైట్లో లాగిన్లోకి వెళ్లి రైతు ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతుకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. రెం డోసారి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రైతు వివరాలు డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత ఆ రైతుకు గ్రామంలో పొలం ఉన్నట్టయితే ఆటోమె టిక్గా ల్యాండ్ డిటైల్స్ డిస్ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్ చేసి సబ్మిట్ చేయగానే రైతుకు మరోసారి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైతుకు 11 సం ఖ్య ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ తో కూడిన మెస్సేజ్ రైతు మొబైల్కు వెళ్లడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రయోజనాలు ఎన్నో..
ప్రతీ రైతుకు జారీ చేసే యూనిట్ ఐడీకి ఆయా రైతు లు సీజన్లో పొందే సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను అనుసంధానం చేస్తారు. ఇలా తయారైన ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాం డ్ ఏపీఐ, ఆధార్ 5 బెస్ట్ అదంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్ కు సైతం అనుసంధానం చేస్తారు. ఈ ఐడీని ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్తో కూడిన ఆర్ధిక సేవలను పొం దవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందు కు ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశం లో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకా యిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఇప్పటి వరకు జిల్లాలో 132540 మంది రైతు సోదరులు నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతు సోదరులందరూ మార్చి31 వ తేదీలోగా నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *