గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి, ఖాళీ స్థల పన్నుల బకాయిలు ఈ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పన్ను చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఈ నెలాఖరులోపు ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీ 50 శాతం రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. తేదీ: 25.03.2025 ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ సదుపాయం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే పన్ను వడ్డీతో చెల్లించిన వారందరికీ కుడా వర్తిస్తుందని, సదరు వడ్డీలో 50 శాతం రాబోవు ఆర్ధిక సంవత్సరానికి పన్నులకు జమ కాబడుతుందని పేర్కొన్నారు. ఆస్తి పన్ను మొత్తంలో గతంలో సగం చెల్లించి మిగిలిన బకాయిలున్న వారు కూడ ఈ నెలాఖరులోపు ఏక మొత్తంలో చెల్లిస్తే వారికి కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందన్నారు. కావున ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని నగర పరిధిలోని పన్ను బకాయిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెలలో ఉగాది, రంజాన్ వంటి పండుగ, సెలవు రోజుల్లోనూ జిఎంసి మెయిన్, సర్కిల్ కార్యాలయాల్లో క్యాష్ కౌంటర్లు పని చేస్తాయని తెలిపారు.
Prajavartha Online Telugu News