సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు పై అవగాహన కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏప్రిల్ 1వ తారీఖు నుండి సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలును పక్కాగా అమలు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులతో, హోలేసేల్ వ్యాపారస్తులతో మరియు రిటైల్ వ్యాపారస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల థీం క్రింద ప్లాస్టిక్ నిషేధం అమలు పై కార్యక్రమాలు నిర్వహించుట జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్ధాలు ప్రజలకు వివరించుట జరుగుతుందన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగించుట వలన పర్యావరణానికే కాక ప్రజల ఆరోగ్య సమస్యలకు కూడా కారణభూతమౌతుందన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వినియోగం వలన ఎన్నో రకాల కాన్సర్ ల బారిన ప్రజలు పడుతున్నారు. కావున ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సింగల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి వాడిన తరువాత వాటి వ్యర్ధాలను కాలువల్లో మరియు భూమి పై పడవేయుట వలన మురుగు నీరు పారుదలకు అడ్డుపడుతుందని, అలాగే వర్షాలు పడినప్పుడు ప్లాస్టిక్ అడ్డుపడుట వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకక పోవుట వలన భూమిలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా తగ్గిపోతుందన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు పై నగర ప్రజలకు అవగాహన కలిగించాలని, దానికి వ్యాపారస్తుల సహాయ సహకారాలు కావాలన్నారు.
అనంతరం జరిగిన విలేఖరు సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, కమర్షియల్ సంస్థలలో పార్కింగ్ ఫీజుల వసూళ్ళ పై రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. సదరు మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలోని సినిమా హాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ చేసిన 30 నిమిషాల లోపు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, 30 నిమిషాల నుండి 1 గంటలోపు ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన బిల్లు ఉంటె ఫీజు అవసరం లేదని, 1 గంటకు మించి గడిపిన వారు పార్కింగ్ ఫీజుకు మించి కొనుగోలు చేస్తే పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. ఆయా ఫీజుల వసూళ్ళు, ప్రభుత్వ మార్గదర్శకాల పై గుంటూరు నగరంలోని కమర్షియల్ సంస్థలకు నోటీసులు జారీ చేస్తామని, అతిక్రమించిన సంస్థలను సీజ్ చేస్తామన్నారు.
సదరు సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు యేల్చూరి వెంకటేశ్వర్లు, సి.యం.హెచ్.ఓ డాక్టర్ అమృతం, సి.పి రాంబాబు, యం.హెచ్.ఓ డాక్టర్ రవిబాబు, పి.ఓ రామారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్, హోల్సేలా వ్యాపారులు మరియు రిటైల్ వ్యాపారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *