బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్రీలక్ష్మి కోటిపల్లి బస్టాండ్ దగ్గర గల ప్రధాన తపాలా కార్యాలయం ప్రక్కన గల బాలికోన్నత పాఠశాలలో గల “జియాన్ అంధుల స్కూల్ ” లో ప్రాంతీయ భాషలో దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు బ్రెయిలీ సాధనాలు పై అవగాహన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి, డిఎల్ఎస్ఎ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పేద పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు న్యాయం అందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో జిల్లా కోర్టు లలో న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేయబడిందని,న్యాయం పొందడానికి,ఏ విధమైన రుసుము చెల్లించనవసరం లేదని అన్నారు. అంధుల పాఠశాలలలో శ్రద్దగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు ఏందరో సంపాదించుకున్నారన్నారు. భగవంతుడు, అంధులకు, ప్రత్యేక సహజ జ్ఞానాన్ని, ప్రసాదించాడని, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని, పిల్లలందరూ మంచి భవిష్యత్తు కై పాటు పడాలన్నారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవ రావు, మాట్లాడుతూ, తన డిపార్ట్మెంట్ తరపున ఏవిధమైన సహాయం కావలిసి వొచ్చినా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో వెల్ఫేర్ అధికారి యు రాజు,టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *