Breaking News

జిల్లాలో 12 ఉప సర్పంచ్ ల, ఒక ఎంపిపి, రెండు కో ఆప్షన్ సభ్యుల పరీక్ష ఎన్నికలు

-మార్చి 27 వ తేదీ ఎన్నికల నిర్వహణా పై పంచాయతి రాజ్, రెవిన్యూ, పోలీస్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో సమావేశం
-ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో 12 గ్రామాలలో ఉప సర్పంచ్ ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు , పెరవలి, రంగంపేట ల రెండు కో ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆమేరకు అధికారులు బాధ్యత తో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు స్పష్టం చేశారు .

మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో ఒక ఎంపిపి, రెండు కో ఆప్షన్ సభ్యుల, 12 ఉప సర్పంచ్ పరోక్ష ఎన్నికలకు ఎన్నికల అధికారులతో, సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లాలో 12 గ్రామాల కి చెందిన 12 మందికి ఉప సర్పంచ్ ఎన్నికలు, బిక్కవోలు ఎంపిపి అధ్యక్షులు , పెరవలి మండలం కో ఆప్షన్ సభ్యుల, రంగంపేట మండలం కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గోకవరం మండలం – మల్లేశ్వరం, కొవ్వూరు మండలం – పెనకనమెట్ట, రాజానగరం మండలం – పాత తుంగపాడు, గోపాలపురం మండలం – కొవ్వూరుపాడు , వెంకటాయపాలెం, తాళ్లపూడి మండలం – తాళ్లపూడి, అనపర్తి మండలం – లక్ష్మీనరసాపురం, రంగంపేట మండలం – మర్రిపూడి, కడియం మండలం – మురమండ, సీతానగరం మండలం మునికూడలి, ఉండ్రాజవరం మండలం – ఉండ్రాజవరం గ్రామా ల్లో ఉప సర్పంచ్ లకు ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు.

ఎన్నికల నిర్వహించే సమ యంలో ఎన్నికల అధికారులు ఏదైనా కారణంతో ఉప సర్పం చ్ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో తదుపరి రోజూ శెలవు సెలవు దినం అయినప్పటికీ, కానప్పటికీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉప సర్పం చ్ ఎన్నిక నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేయు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేసి ఉప సర్పంచ్ ఎన్నికను ఇతర తేదీన నిర్వహించేందు కు ఆదేశించవచ్చు, అనుమతించవచ్చు అని తెలిపారు.

ఎన్నికల నిర్వహించే సమయంలో పోలీసు బందోబస్తు పకడ్బందీగా వ్యవహరించాలని తెలిపారు. మార్చి 27 ఉదయం 11 గంటలకి ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఉపసర్పంచ్ ఎన్నికల నియమావళి 2006 ప్రకారం ఎన్నికల నిర్వహించా ల్సిందిగా జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఏదైనా సభ్యుడు ఉప సర్పంచ్ ఎన్నిక కోసం ఒక్క సభ్యుని మాత్రమే ప్రతిపాదించాలని తెలిపారు. మరొక సభ్యుడు మద్దతు ఇవ్వాలన్నారు. ప్రతిపాదించ బడిన, మద్దతు పొందిన అందరి అభ్యర్థుల పేర్లను సమావేశా అధ్యక్షుడు చదివి వినిపించాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరణకు 30 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది అన్నారు. ఒకే ఒక అభ్యర్థి చెల్లుబాటు అయ్యే విధంగా నామినేట్ అయితే వారిని ఎన్నికైనట్లుగా ప్రకటించాలన్నారు. సమావేశ అధ్యక్షుడు ఉప సర్పంచ్ అభ్యర్థి పొందిన ఓట్ల సంఖ్యను లెక్కించి, ప్రతి అభ్యర్థి వచ్చిన ఓట్లను ప్రకటించాలన్నారు. ఎక్కువ ఓట్లు పడిన అభ్యర్థులు ఎన్నికైనట్లుగా ప్రకటించాలన్నారు.

మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం 27.03.2025న ఉదయం 10.00 గంటలకు ముందు నామినేషన్ల స్వీకరణ పూర్తి చెయ్యాలి. అనంతరం నామినేషన్ల పరిశీలన ఉదయం 10.00 నుంచి  మధ్యాహ్నం 12.00 గంటల లోగా పూర్తి చెయ్యాలి. చెల్లుబాటు అయ్యే నామినేట్ అభ్యర్థుల జాబితా ప్రచురణ  మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థిత్వం ఉపసంహరణ సమయం మధ్యాహ్నం 1.00 గంట వరకూ ఉంటుందన్నారు.  గత సమావేశాలలో ప్రమాణం చేయని సభ్యులు ఎవరైనా ఉంటే, సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ప్రమాణం చేయిస్తారన్నారు. పరోక్ష విధానంలో మ.1.00 గంట నుంచి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన అనంతరం ఫలితాల ప్రచురణ చెయ్యాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి సీతారామమూర్తి, అదనపు ఎస్పీ ఏ వి సుబ్బరాజు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కాకినాడ జెడ్పీ డిప్యూటి సీఈవో ఎస్. రామ్ గోపాల్, ఏలూరు జెడ్పీ ఇంఛార్జి సీఈవో కే. భీమేశ్వర్ , ఎడి మార్కెటింగ్ ఎమ్ సునీల్ వినయ్ లతో పాటు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతామణి, డివిజనల్ పంచాయతీ అధికారులు ఎం నాగలత, వై. అమ్మాజీ, ఎస్. ఈ, ఆర్డ బ్ల్యూఎస్ బీవీ గిరి డిఎస్పీ లు భవ్య కిశోర్, వై. శ్రీకాంత్, బి. విద్యా, ఎంపిడివోలు , ఈవో పీఆర్ది లు, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *