మెగా డి.యస్.సి. పరీక్షలకు ఆన్-లైన్ ద్వారా ఉచిత శిక్షణ

-దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకూ పొడిగింపు
-జిల్లా బిసి సంక్షేమ అధికారి బి శశాంక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధప్రదేశ్ బి.సీ స్టడీ సర్కిల్ రాజమహేంద్రవరం నందు మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఆన్-లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును మార్చి 31 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, స్టడీ సర్కిల్ సంచాలకులు బి శశాంక మంగళ వారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

టెట్ (టీచర్ ఏలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో అర్హత సాధించిన వారికి తూర్పుగోదావరి జిల్లా వాసులకు మాత్రమే బి. సి..(BC) మరియు EWS (EBC) కేటగిరీలకు చెందిన అభ్యర్థుల నుండి మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఉచిత ఆన్-లైన్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరించబడును. టెట్ నందు ఉత్తీర్ణులైన వారు అర్హులు మరియు టెట్ పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుదురు. మెగా డి. ఎస్. సి ఆన్లైన్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తులు స్వీకరించు తేదీ విడిగించబడినది మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలియజేశారు.

మెగా డి.యస్.సి. ఆన్-లైన్ ఉచిత శిక్షణ కొరకు దరఖాస్తు చేయు వారు టెట్ (టిచర్ ఏలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో అర్హత సాదించిన మార్కుల పత్రము, నేటివిటీ పత్రము, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు మరియు 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు జతపరచి ఆంధప్రదేశ్ బిసి స్టడీ సర్కిల్, నియర్ ఆర్ట్స్ కాలేజ్ వై జంక్షన్ రాజమహేంద్రవరం కార్యాలయము నందు మీ దరఖాస్తులు అందజేయవలెను. మార్చి 10వ తేదీ నుండి దరఖాస్తు పత్రాలను ఈకార్యాలయము నందు అందుబాటులో ఉంచినట్లు తెలియ చేశారు.

మరిన్ని వివరాలకు నేరుగా కార్యాలయములో గాని, ఫోన్ నెంబరు 9393934825, 9705326221,9000058102 నందు సంప్రదించగలరని రాజమహేంద్రవరం ఆంధ్ర ప్రదేశ్ బి.సి. స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *