అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.. రైల్వే భద్రత పనుల కింద రోడ్లు మరియు బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా సేతుబంధన్ – కేంద్ర రోడ్లు మౌలిక సదుపాయాల నిధి (CRIF) పథకం కింద కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో V-V సెక్షన్ మీదుగా సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. సామర్లకోట – ఉప్పాడ రోడ్డులోని రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431 కు బదులుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి రెండవ దశ పరిపాలనా అనుమతుల కింద రూ. 59.70 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు..
పిఠాపురం నియోజకవర్గంలో ట్రాఫిక్ రద్దీ, స్థానిక ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, గత ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ప్రజలకు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది.. నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు, ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.. నేడు ఆర్ధిక ఇబ్బందులు రాష్ట్రాన్ని వెంటాడుతున్నా, నాడు ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నేరవేరుస్తూ కూటమి ప్రభుత్వం విజయవంతంగా పయనిస్తోందన్నారు.
గత 5 ఏళ్లలో రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై వైసీపీ ప్రభుత్వం ఎక్కడా దృష్టి పెట్టిన దాఖలానే లేదు.. దీంతో రాష్ట్రంలోని రహదారులు అత్యంత దారుణంగా మారిపోయిన పరిస్థితిలో ప్రజలు పడ్డ తీవ్ర ఇబ్బందులు మన కళ్లతో చూశాం.. దీంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టగానే గుంతల రహిత రోడ్ల మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, విజయవంతంగా పూర్తి చేశామన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల కి.మీ మేర రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్ది.. 95 శాతం పైగా గుంతల రోడ్ల రూపురేఖలను నేడు పూర్తిగా మార్చివేయడం జరిగిందన్నారు.. అతి త్వరలో రాష్ట్రంలో 100 % రోడ్లను గుంతల రహితంగా తీర్చిదిద్దుతామని తెలిపారు..
Prajavartha Online Telugu News