అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సియం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏడాది జూన్ 15 నుండి ఈనెల 19 వరకు రాష్ట్రంలో మొత్తం 8లక్షల 26వేల ఫిర్యాదులు రాగా వాటిలో ఇప్పటి వరకు 7లక్షల 22వేల ఫిర్యాదులు పరిష్కరించారని అన్నారు. పరిష్కరించిన ఫిర్యాదుల్లో 6 లక్షల 99వేలు విత్ ఇన్ ఎస్ఎల్ఏ,22వేల 770 బియాండ్ ఎస్ఎల్ఏ లో పరిష్కరించారని తెలిపారు. ఫిర్యాదులను కేవలం రొటీన్ విధానంలో పరిష్కరించడం కాకుండా ఆ సమస్యను శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా క్వాలిటీ డిస్టోజల్ ఉండాలన్నారు.కావున జిల్లా కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.అదే విధంగా ఎక్కువ ఫిర్యాదులు వచ్చే శాఖలు మరింత దృష్టి పెట్టాలన్నారు. గ్రీవియెన్స్ రిడ్రస్సల్ పై ఎక్సటర్నల్ ఆడిట్ చేయాలని అన్నారు.వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి గ్రీవియెన్స్ ఫిర్యాదులు కనిష్ట స్థాయికి తగ్గాలని సియం స్పష్టం చేశారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో మొత్తం 8లక్షల 26వేల ఫిర్యాదులు రాగా వాటిలో 7లక్షల 22వేల పరిష్కరించామని వివరించారు.వాటిలో 5లక్షల 72 ఫిర్యాదుల ఆడిట్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 2లక్షల 59వేల 642 రీ సర్వేకు సంబంధించినవి,2లక్షల 34వేల 944 రెవెన్యూ సదస్సులు ద్వారాను,లక్షా 91వేల 494 ఫిర్యాదులు పిజిఆర్ఎస్ ద్వారా వచ్చాయని సిఎస్ విజయానంద్ పేర్కొన్నారు.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News